ఏపీలో మరో 14,429 కరోనా పాజిటివ్ కేసులు, 103 మరణాలు

  • గత 24 గంటల్లో 84,502 కరోనా పరీక్షలు
  • చిత్తూరు జిల్లాలో 2,291 కొత్త కేసులు
  • అత్యల్పంగా విజయనగరంలో 535 కేసులు
  • 20,746 మందికి కరోనా నయం
  • ఇంకా 1,80,362 మందికి చికిత్స
ఏపీలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 84,502 కరోనా పరీక్షలు నిర్వహించగా 14,429 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 2,291 పాజిటివ్ కేసులు నమోదు కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 2,022 కేసులు గుర్తించారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 535 కొత్త కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 20,746 మంది కరోనా నుంచి కోలుకోగా, 103 మంది మరణించారు. చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 15 మంది చొప్పున మహమ్మారికి బలయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 16,57,986 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 14,66,990 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,80,362 మందికి చికిత్స జరుగుతోంది. కరోనా మృతుల సంఖ్య 10,634కి చేరింది.

Corona Virus
Andhra Pradesh
New Cases
Positivity Rate
Deaths
COVID19

More Telugu News